మంగళ హారతి పాట: శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా

శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా, మనసారా స్వామిని కొలిచీ హరతులీరమ్మా || 2 ||

నోచినవారికి నోచిన వరము, చూసిన వారికి చూసిన ఫలము || శ్రీ ||

స్వామిని పూజించే చేతులె చేతులట, ఆ ముర్తిని దర్శించే కనులే కన్నులట || 2 ||

తన కథవింటే ఎవ్వరికైనా జన్మ తరయించునట || శ్రీ ||

ఏ వేళైనా, ఏ శుభమైనా, కొలిచే దైవం, ఈ దైవం, ఆ … || శ్రీ ||

అన్నవరములో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం….. || శ్రీ ||

అర్చన చేద్దామా మనసు అర్పన చేద్దామా, స్వామికి మదిలోనా కోవెల కడధామా

పధి కాలాలు పసుపు కుంకుమలిమ్మని కోరేమా || శ్రీ ||

మంగళమనరమ్మా జయమంగళమనరమ్మా, కరములు జోడించి శ్రీ నందనమలరంచి,

మంగళమగు శ్రీ సుందరమూర్తికి వందనమనరమ్మా || శ్రీ ||

Advertisements

మంగళ హారతి పాట: చక్కాని సాంబశివునికి

పల్లవి: చక్కాని సాంబశివునికి జయ మంగళం, మా తండ్రి సోమెశ్వరునికి శుభ మంగళం,
సుందారి పార్వతమ్మకు నిత్య మంగళం ||

చరణం: పారేటి సర్పములనుబట్టీ, పరమేశ్వరుడు ధరియింపగా,
బుస్సుమనుచూ పడగాలెత్తి, మెడలోన హారముగా మెరియగ ||

చరణం: బూది నిండా బూసుకోని, మేనిపై పులిచర్మము గప్పిన,
మేటిగా రుద్రాక్షామాలలు, ప్రీతితో ధరియించిన స్వామికి ||

చరణం: మూడు కండ్లా మహా దేవుడూ, మురహరుడు పరమేశ్వరుడు,
ఆది అంతము లేని శివునికి, అచ్యుతునీ కన్నాతండ్రికి ||

చరణం: ముదము మలరగ జడలలోనా, ముద్దుల గంగను దాచిన వానికి,
ముద్దుల నెద్దు ఎక్కిన వానికి, మూడు జగములు యేలె స్వామికి ||

చరణం: ఉండే ఇళ్ళు, వంటా పాత్రా, కట్టుబట్టా లేని శివునకు,
కప్పెరాతో భిక్షామెత్తి, మూడు జగములు యేలె స్వామికి ||

భజన పాట: శ్రీ పార్వతీ దేవి (కాళహస్తి మహత్యం)

పల్లవి: శ్రీ పార్వతీ దేవి, చేకోవె శైలకుమారి || 2 ||
మా పూజలే తల్లి, గౌరీ శంకరీ, గౌరీ శంకరీ || 2 ||

చరణం: ప్రాపునీవె పాపహారి, పద్మ పత్ర నేత్రి || 2 ||
కాపాడరావమ్మ కాత్యాయిని || 2 ||

చరణం: నిన్ను నమ్మినాను తల్లి, అన్నపూర్ణ దేవి || 2 ||
పాలింపరావమ్మ పరమేశ్వరి || 2 ||